ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉన్నది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉదయం కర్ఫ్యూ విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి షాపులతో పాటుగా మామూలు వాహనాలు, రవాహా వాహనాలు నిలిచిపోనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు. దీంతో…
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.
మే 2 న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్…
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని…
పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా…
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్నది. ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతిలోనే ఉంది పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. నారా లోకేష్ విన్నూతంగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా అలిపిరిలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… తమ…