రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో సహస్రకళషాభిషేకం భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక 21వ తేదికి ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి కే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది. 22వ తేది నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అలా 24వ తేదిన వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. అయితే చూడాలి మరి పాలకమండలి సమావేశంలో ఏం జరుగుతుంది అనేది.