తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించిన ఓ యువతి ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుంది. ఇది వరకే ఆమె ఇద్దరిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియక ఆమెను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. కాగా ఆమె అతడి నుంచి ఆరు లక్షల వసూళ్ళు చేసి పరారైయింది. దీంతో మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. అయితే తాజాగా కొత్తగూడెంకు చెందిన వినయ్… తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి తాను…
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా…
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ…
కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అనేక దేవాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తిరుమల ఆలయానికి భక్తుల రద్ధీ తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీవారీ దర్శనాలు, ఆదాయంపై కరోనా ఎఫెక్ట పడింది. మే నెలలో భక్తున సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మే నెలలో మొత్తం 2,13,749 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.11.95 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మే నెలలో 91,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా ప్రభావం,…
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అలిపిరి గేటు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమలోకి తీసుకొస్తున్నది. ఈ రోజు నుంచి పెంచిన ధరలు ప్రకారం అలిపిరి టోల్‌గేటు వద్ద చెల్లింపులు ఉండనున్నాయి. కార్లకు రూ.50, బస్సులకు రూ.100 చోప్పున టీటీడీ వసూలు చేయబోతున్నది. అయితే, ద్విచక్రవాహనాలకు మాత్రం ఎలాంటి వసూళ్లు ఉండవు. ఇప్పటికే రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద…
హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టిటిడీ ఇప్పటికే పేర్కోన్నది. దానకి సంబందించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలలో పలు తప్పులు ఉన్నాయని హనుమాన్ తీర్ధక్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు తిరుపతిలోని సంస్కృత విధ్యాపీఠంలో టీటీడి పండితులకు, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీకి మద్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టిటిడీ…
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో…
నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ…