కరోనా సమయంలో తమ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి… కరోనాకు ఎదుర్కోవడానికి ఇప్పుడున్న ఏకైకా మార్గం వ్యాక్సినేషన్.. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం.. అయితే, వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టీటీడీ… 45 ఏళ్ల పైబడి వాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జూన్ మాసం జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది… జూలై 7వ తేదీ లోపల 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులంతా వాక్సిన్ వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన టీటీడీ.. జూలై 7నాటికీ వాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించి… కరోనా టీకా వేసుకోని ఉద్యోగులకు జీతాలు జారీని నిలిపివేయాలని పేర్కొంది. కాగా, వ్యాక్సిన్ వేయించుకున్న పలు విభాగాలకు చెందిన ఉద్యోగుల జీతాలను పలు రాష్ట్రాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.