తిరుపతిలో మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్యకేసులో భర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య భువనేశ్వరీ కరోనా ప్లస్ వేరియంట్‌తో చికిత్స పొందుతూ చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అనుమానం వచ్చని భువనేశ్వరీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివశించే అపార్ట్‌మెంట్‌కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. భార్యమృతదేహన్ని సూట్‌కేసులో ఉంచుకొని బయటకు వస్తున్న దృశ్యాలు, అనంతరం ఖాళీ సూట్‌కేసుతో ఇంటికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.
Read: ‘కూ’లో స్వీటీ జోరు.. ఫ్రెండ్షిప్ పై బెస్ట్ క్యాప్షన్
ఈ దృశ్యాల ఆధారంగా భార్య భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి హత్యచేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, శ్రీకాంత్‌రెడ్డిని విజయవాడ-కోదాడ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. భువనేశ్వరీ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో తిరుపతి వచ్చింది. భర్తతో కలిసి అక్కడే నివసిస్తున్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక శ్రీకాంత్ రెడ్డి తరచుగా గొడవపడేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.