నిన్న తిరుమల శ్రీవారిని 13358 మంది భక్తులు దర్శించుకోగా 5390 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 1.08 కోట్లు గా ఉంది. అయితే ఈ నెల 19వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం కానుండగా ఈ నెల 20వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21వ తేదికి పాలకమండలి గడువు ముగియనుండగా ఈ 22 నుంచి 24వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 24వ తేదిన శ్రీవారి ఆలయంలో వర్చువల్ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. అయితే ఇవాళ ఆన్ లైన్ లో 22,23,24వ తేదిలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ రోజుకి 5 వేల టోకేన్లు చోప్పున విడుదల చేయనుంది.