తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించిన ఓ యువతి ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుంది. ఇది వరకే ఆమె ఇద్దరిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియక ఆమెను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. కాగా ఆమె అతడి నుంచి ఆరు లక్షల వసూళ్ళు చేసి పరారైయింది. దీంతో మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. అయితే తాజాగా కొత్తగూడెంకు చెందిన వినయ్… తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి తాను సుహాసిని రెండో భర్తనంటూ తెరపైకి వచ్చాడు. తనను కూడా సుహాసిని రూ.15 లక్షల మేర మోసగించిందని తెలిపాడు. తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అప్పటి సీఐ ఫిర్యాదు స్వీకరించలేదని, ఇది జరిగిన కొన్నిరోజులకే ఇంట్లో నగదు, బంగారం తీసుకుని సుహాసిని పారిపోయిందని తెలిపాడు.