తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలో నర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయమ్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. దీంతో ఆమెను తిరుపతి స్విమ్స్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి పద్మావతి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న జయమ్మ, మెడికల్ వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వార్డులో మిగతా రోగుల్లో భయాంధోళనలకు గురయ్యారు. బ్లాక్ ఫంగస్ సోకిందనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.