పదవి కోసం పైరవీలు చేసినవాళ్ళకి ఆ నిర్ణయం నిరాశ పరిచిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిస్థాయిలో పాలకమండలి ఏర్పాటవుతుందని భావిస్తుంటే స్పెసిఫైడ్ అథారిటీ వచ్చింది. టీటీడీలో పదవి కోసం పైరవీలు సాగించిన వారికి ఆ నిర్ణయం నిరాశపర్చింది. కొత్త బోర్డు ఏర్పాటుకు మరింత సమయం పడుతుందన్న సంకేతాలను పంపింది ప్రభుత్వం. ఇంతకీ సర్కార్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?
ఇప్పట్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు లేనట్టేనా?
Also Read
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేశారు సీఎం జగన్. సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత 3 నెలలకు పూర్తిస్థాయిలో పాలకమండలి సభ్యులను ప్రకటించారు. ఆ కమిటీ గడువు ఈ నెల 21తో ముగిసింది. మరోసారి అంతే వేగంగా కొత్త బోర్డు ఏర్పాటవుతుందని భావించారు. కానీ.. అలా ఆశించిన వారి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈవో జవహర్‌రెడ్డి ఛైర్మన్‌గా.. అదనపు ఈవో ధర్మారెడ్డిని కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పట్లో పాలకమండలి ఏర్పాటు లేనట్టేనని ఈ చర్యతో స్పష్టం చేసింది .
సభ్యుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిళ్లు!
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరోఛాన్స్ లభిస్తుందని భావించారు. పాలకమండలిలో సభ్యులుగా ఉన్న 10 మందికి మరో అవకాశం ఇస్తారని.. మిగిలిన పదవులకు కొత్తవారిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే పాలకమండలి నియామకానికి బ్రేక్‌లు వేసిందట. ఛైర్మన్ విషయంలో క్లారిటీతో ఉన్నా.. సభ్యుల దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఓ రేంజ్‌లో ఉన్నాయట. ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ కోటాలో క్లారిటీ లేదట. ఢిల్లీ స్థాయిలో పాలకమండలి సభ్యత్వం కోసం ఒత్తిడి ఎక్కువగా ఉందట. అందుకే మధ్యే మార్గంగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసిందట ప్రభుత్వం.
విధానపరమైన నిర్ణయాలకు పాలకమండలి అవసరం
మరో రెండు నెలల వరకు కొత్త బోర్డు ఏర్పాటు చేయరని అనుకుంటున్నారు. సాధారణంగా టీటీడీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే పాలకమండలి అవసరం. వారం క్రితం జరిగిన చివరి బోర్డు మీటింగ్‌లో అనేక విధానపరమైన నిర్ణయాలు తీసేసుకున్నారు. వీటిని అమలు చేయడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి పాలకమండలి భేటీ జరిగాలనే సంప్రదాయం ఉన్నా.. కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. గత కమిటీ ఫిబ్రవరిలో సమావేశమైన తర్వాత ఏప్రిల్‌లో భేటీ కావాలని నిర్ణయించినా కరోనా కారణంగా జూన్‌కు వాయిదా పడింది. దీంతో నాలుగు నెలల తర్వాత సమావేశం జరిగింది.
స్పెసిఫైడ్ అథారిటీ తాత్కాలిక ఏర్పాటుగా కొందరు వాదన
ఈ విధమైన వెసులుబాటు ఉన్న సమయంలో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడం.. ఆశావహులలో అనేక అనుమానాలకు అవకాశం ఇస్తోంది. స్పెసిఫైడ్ అథారిటీలో సాధారణంగా దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిని.. లేదా రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కానీ.. టీటీడీ ఈవో.. అదనపు ఈవోలతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడంతో.. ఇది తాత్కాలిక ఏర్పాటుగా కొందరు భావిస్తున్నారు. మరోపక్క ఇంకో సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. నెలా రెండు నెలలు కాలానికి అయితే స్పెసిఫైడ్ అథారిటీ అవసరం లేదని.. నాలుగు నెలలపాటు పాలకమండలి సమావేశం లేకుండానే.. టీటీడీ పరిపాలన సాగడంతో.. ఇప్పట్లో కొత్త బోర్డు ఏర్పాటు ఉండదని అనుమానిస్తున్నారట.
పదవుల పందేరం పూర్తయ్యాక కొత్త బోర్డు ఏర్పాటు
రాష్ట్రంలోని మిగిలిన నామినేటెడ్ పదవుల పందేరం పూర్తయిన తర్వాతే టీటీడీ పాలకమండలి నియామకం ఉంటుందన్న వాదన కూడా ఉంది. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కని వారికి టీటీడీ బోర్డులో చోటు కల్పించి.. సంతృప్తి పర్చాలన్న యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!