తిరుపతిలో పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో అమె ఇంటిముందు కాల్పులు జరిపాడు చాన్ బాషా అనే యువకుడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె సమీపంలోని కడపనత్తం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాన్ బాషా ఫోన్ నెంబర్ అడగటంతో భయంతో ఇంట్లో వారికి తెలిపింది యువతీ. ఆ తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాన్ బాషా హెచ్చరించారు కుటుంబం సభ్యులు, ఊరిపెద్దలు.
Read Also : నెల్లూరులో ఆసుపత్రులకు భారీ జరిమానా…
పెళ్ళి చేసుకునే అమ్మాయి ముందే తనను కోట్టరని …అ అమ్మాయి కుటుంబ సభ్యులపై కోపంతో యువతి ఇంటి ముందు నాటు తుపాకితో రెచ్చిపోయిన చాన్ బాషా… ఇంట్లో వారు ప్రశ్నించడంతో తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ మిస్ అయ్యి..పక్కింటి తలుపులు ధ్వంసం అయ్యింది. భయంతొ రాత్రి అంతా ఇంట్లోనే ఉండి ఉదయం పోలీసులను ఆశ్రయించారు యువతీ కుటుంబం సభ్యులు,గ్రామస్థులు. దాంతో పోలీసుల యువకుడు చాన్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.