ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు…
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక ఇదిలా ఉంటే, తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తమిళనాడులో తాజాగా 33 కేసులు నిర్ధారణ జరిగినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనెల 15 వ తేదీన తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా, ఈరోజు మరో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 34 కేసులు…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి… దీంతో.. ఆయా రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది తమిళనాడు ప్రభుత్వం.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు రాష్ట్ర ప్రజారోగ్య…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీలో ప్రాంతీయ పార్టీల కూటమి గురించే చర్చించారా? ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తారా? ఫెడరల్ ఫ్రంట్‌కు రూపు తీసుకొస్తారా? ఆ మధ్య శివసేన, ఎన్సీపీలతో మమత చర్చలు..! 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ జాతీయ…
తమిళనాడులో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటి కరప్షన్ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… ఇవాళ ఉదయం అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి తంగమణి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటి కరప్షన్ (డీవీఏసీ) అధికారులు.. అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీలలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు.. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు చేశారు.. Read Also:…
సీఎం కేసీఆర్ సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. 11.10కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.30కు తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు. హోటల్లో బస అనంతరం. రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10కి ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్ చోళలో…
మన దేశంలో… పెట్రోల్, వంట గ్యాస్, వంట నూనెలతో సహా కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ ఆకాశన్నంటుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు టమాటో ధరలు రూ.150 చేరుకోగా.. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా అదే దారి పడుతున్నాయి. అయితే.. తాజాగా… చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తుగూతాయి. వీలైతే ఒక్కొక్కడికి 30 రూపాయల…
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటన అందరినీ కలచివేసింది.. అయితే, అమరులైనవారి పార్థీవ దేహాలను తరలించే మార్గంలో పూల వర్షం కురిపించారు ప్రజలు.. అంబులెన్స్‌లు రాగానే పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.. నీల్గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి వారి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రజలు రోడ్లకిరువైపులా నిలబడి పూల వర్షం…
సీడీఎస్ బిపిన్ రావత్ మరణం యావత్ దేశానికే తీరని లోటని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. బిపిన్ రావత్ మరణం పై స్పందించారు. నాకు సీడీఎస్ రావత్‌తో మంచి అనుబంధం ఉంది. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారన్నారు. చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. విజబులిటి సరిగా…