ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. తండ్రి, కూతురు ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులోని వేలూరులో విషాదాన్ని నింపింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా దురై వర్మ రెండు రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి…
కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర…
తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ…
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు…
ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కు ఇండియాలోని కేరళలో ఓ ఆసుపత్రి కారణంగా అవమానం జరిగింది. కేరళలోని ఆ ఆసుపత్రి పేరు వడకర కార్పోరేటివ్ హాస్పిటల్. మోర్గాన్ ఏమైనా ఆ ఆసుపత్రికి ట్రీట్ మెంట్ కు వచ్చారా? అంటే లేదు. మరి ఆ హాస్పిటల్ లో ఈ హాలీవుడ్ నటునికి జరిగిన అవమానమేంటి? ఈ వడకర కార్పోరేటివ్ హాస్పిటల్ లో ఓ అడ్వర్టైజ్ మెంట్ కు హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ బొమ్మ ఉపయోగించుకున్నారు. అందులో…
కరోనా విజృంభణతో కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మూతపడిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మహారాష్ట్రలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, కర్ణాటకలోనూ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం.. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి విద్యాసంస్థలను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో పడిపోయారు.. రేపటి…
కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఇక అంతేకాదు.. ఇప్పటికే అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ.. రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. అలాగే, ఈ ఆదివారం (జనవరి 30)…
వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పరాయివారిపై ఉన్న మోజుతో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా తమిళనాడులో ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చింది ఒక భార్య. సాంబార్ లో విషం కలిపి భర్తను చంపి, అనారోగ్యంతో కన్నుమూసినట్లు అందరిని నమ్మించింది. కానీ, చివరకు బంధువుల అనుమానంతో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్ (47) కి కొన్నేళ్ల క్రితం సూర్య తో…
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్…
భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో…