Next Supreme Leader of Iran: ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర్’ రేసులో ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Next Supreme Leader of Iran: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం ఇప్పుడు పెను రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఇటు అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అటు అంతర్గత అధికార పోరు మధ్య ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అధికారిక మీడియా ‘ప్రెస్ టీవీ’ కూడా ఖమేనీ మరణాన్ని ధృవీకరించడంతో, ఇప్పుడు అందరి దృష్టి “ఖమేనీ వారసుడు ఎవరు?” అనే అంశంపైనే ఉంది. ఇరాన్ రాజ్యాంగంలోని “విలాయత్-ఎ-ఫకీహ్” సూత్రం ప్రకారం.. సుప్రీం లీడర్ పదవిని కేవలం అత్యున్నత స్థాయి మత పండితుడు (ముజ్తహిద్) మాత్రమే చేపట్టాలి. అయితే ఖమేనీ తన జీవితకాలంలో అధికారికంగా ఎవరినీ వారసుడిగా ప్రకటించకపోవడం ఇప్పుడు ఉత్కంఠకు దారితీస్తోంది.
READ ALSO: Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
రేసులో ఉన్న ప్రధాన పేర్లు ఇవే..
ప్రస్తుతం సుప్రీం లీడర్ పదవికి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో మోజ్తబా ఖమేనీ, హసన్ ఖమేనీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తు్న్నాయి.
మోజ్తబా ఖమేనీ: ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు. ఇరాన్ రాజకీయాల్లో, నిఘా వర్గాల్లో ఈయనకు పట్టు ఎక్కువ.
హసన్ ఖమేనీ: ఇరాన్ వ్యవస్థాపకుడు ఆయతుల్లా ఖొమేనీ మనవడు. ఈయనకు మతపరమైన సంస్థల్లో, సంప్రదాయవాదుల్లో మంచి గుర్తింపు ఉంది.
అధికారాన్ని నిర్ణయించే ‘నిపుణుల మండలి’ (Assembly of Experts)
ఇరాన్ సుప్రీం లీడర్‌ను అధికారికంగా ఎన్నుకునే బాధ్యత 88 మంది మత పండితులతో కూడిన ‘నిపుణుల మండలి’కి ఉంటుంది. కానీ, వాస్తవానికి తెరవెనుక చక్రం తిప్పేది మాత్రం దేశంలోని శక్తివంతమైన సంస్థలే. వారసుడిగా ఎవరు వచ్చినా.. దేశంలోని ప్రధాన మత సంస్థలను, సైన్యాన్ని ఒప్పించడం వారికి పెద్ద సవాలుగా మారనుంది.
IRGC పాత్ర అత్యంత కీలకం..
ఇరాన్ రాజకీయాల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) అత్యంత శక్తివంతమైన విభాగం. ఇది నేరుగా సుప్రీం లీడర్‌కే జవాబుదారీగా ఉంటుంది. తాజా దాడుల్లో ఐఆర్‌జీసీ కమాండర్ మొహమ్మద్ పక్‌పూర్ కూడా మరణించడంతో, ఈ సంస్థలో అంతర్గత అధికార సమతుల్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కొత్త సుప్రీం లీడర్ ఎవరనేది ఐఆర్‌జీసీ మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ భవిష్యత్తును నిర్ణయించేది ఈ సైనిక విభాగామేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్థితి కూడా ప్రస్తుతం అస్పష్టంగానే ఉంది. ఆయన నివాసంపై కూడా దాడులు జరగడంతో ఆయన క్షేమ సమాచారంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పాలన పూర్తిగా రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. కొత్త నాయకత్వం ఇరాన్ ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తుందా? లేక అంతర్గత పోరుతో ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం వైపు సాగుతుందా? అనేది అతి త్వరలో తేలనుంది.
READ ALSO: Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!