సంపాదన విలువ తెలియాలంటే రూపాయి.. రూపాయి కూడబెట్టాలి అని చెబుతుంటారు పెద్దలు.. ఓ యువకుడిని చూస్తే అది నిజమేగా అనాల్సిందే.. విషయం ఏదైనా సరే.. దాని వెనుక కృషిని బట్టే ఫలితం ఉంటుంది.. ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది… అత్యంత ఖరీదైన బైక్‌ను మొత్తం రూ.1 నాణాలతో కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఆ యువకుడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు బైక్ కొనాలని అనుకున్నాడు.. మూడేళ్ల క్రితం బైక్ కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు వెళ్లి అడిగితే.. అతడికి నచ్చిన బైక్ ఖరీదు.. రూ.2 లక్షలుగా చెప్పారు.. అప్పుడు అతని దగ్గర అంత మొత్తం లేదు.. కానీ, అప్పటి నుంచే.. ఏది చేసినా.. తన బైక్ కోసమే అన్నట్టుగా.. రూపాయి నాణేలు సేకరించడం మొదలు పెట్టాడు.. ఇప్పుడు సుమారు 2.6 లక్షల రూపాయి నాణేలతో తన డ్రీమ్ బైక్‌ని కొనుగోలు చేసి ఔరా..! అనిపించాడు.
Read Also: CBI: అక్రమాస్తుల కేసు.. కాంగ్రెస్ నేతకు మూడేళ్ల జైలు..
అమ్మపేటలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న భూబతి.. బీసీఏ గ్రాడ్యుయేట్ చేశాడు.. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను కూడా చేస్తుంటాడు.. మూడేళ్ల క్రితం తనకు నచ్చిన బైక్ ధర గురించి వాకాబు చేస్తే రూ.2 లక్షలని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే అప్పట్లో బైక్ కొనేంత మొత్తం అతని వద్ద లేదు. అయినప్పటికీ, అతని కోరిక తీరలేదు, ఆ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి ప్రతీ పైసను పొదుపు చేయడం ప్రారంభించాడు.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించిన ఆదాయం నుండి డబ్బును ఆదా చేయాలని నిర్ణయించుకున్నాను. బైక్ ఖరీదు గురించి ఇటీవల ఆరా తీయగా ఇప్పుడు ఆన్ రోడ్ రూ.2.6 లక్షలు అని తెలిసింది.. ఈసారి నా దగ్గర మొత్తం ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు భూపతి.. ఇక, శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి మినీ వ్యాన్‌లో గోనె సంచులతో నాణేలను బజాజ్ షోరూమ్‌కి తీసుకొచ్చాడు భూపతి.. ఆ మోటార్ సైకిల్ షోరూం సిబ్బందికి ఆ నాణేలను లెక్కించేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ వెల్లడించారు.. ఇలానే ఇటీవల ఒక వృద్ధుడు తన డ్రీమ్ కారును కొనుక్కునేందుకు తన పెన్షని వెచ్చించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. కాగా, ఇప్పుడు భూపతి.. రూపాయి నాణేలతో రూ. 2.6 లక్షల విలువైన బజాజ్ డోమినార్ 400సీసీ బైక్ కొనుగోలు చేసి వార్తలకు ఎక్కాడు.. తొలుత షోరూమ్ సిబ్బంది నాణేలను తీసుకోవడానికి ఇష్టపడలేదని.. తర్వాత భూబతి తన స్నేహితులు మరియు సిబ్బందితో కలిసి నాణేలను లెక్కించారు, దీనికి మొత్తంగా 10 గంటల సమయం పట్టినట్టు చెబుతున్నారు.. మీడియా కథనాల ప్రకారం, భూబతి దేవాలయాలు, హోటళ్ళు మరియు టీ షాపులను సందర్శించడం ద్వారా తన నోట్లను మార్చుకున్నాడట.. నోట్లను నాణేలుగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెబుతున్నాడు..