Electric Bike Blast: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. తండ్రి, కూతురు ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులోని వేలూరులో విషాదాన్ని నింపింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా దురై వర్మ రెండు రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి తండ్రీకూతుళ్లు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా, ఓవర్ చార్జింగ్ కారణంగా వైరు తగిలి బైక్ పేలిపోయింది.. మరో బైక్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే, పేలుడు ధాటికి భారీగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లు బాత్‌రూమ్‌లో దాక్కున్నారు.. అదే వారి ప్రాణాలను తీసింది..
Read Also: GVL: అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే కేంద్రం నిధులు ఎక్కువ.. చర్చకు మేం రెడీ..
Also Read
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాత్‌రూమ్‌లోకి కూడా దట్టమైన పొగలు రావడంతో.. ఊపిరాడక తండ్రీకూతుళ్లు అక్కడే మృతిచెందారు.. ఇక, దురైవర్మ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. మంటలార్పి లోపలికి వెళ్లిచూస్తే.. అప్పడికే తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఇక, బాత్‌రూమ్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మరోవైపు.. కొత్తగా కొనుగోలు చేసిన బ్యాటరీ బైక్ పేలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!