కర్ణాటకలోని విద్యా సంస్థల్లో మొదలైన హిజాబ్ వ్యవహారం.. మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.. ఇప్పుడు తమిళనాడును కూడా తాకింది.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. మధురైలో హిజాబ్ ధరించి వచ్చిన ఓ మహిళను బీజేపీ బూత్ ఏజెంట్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.. హిజాబ్ తొలగించిన తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని.. అప్పుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించాడు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా.. డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పక్షాల పోలింగ్ ఏజెంట్లు… సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి పంపించాలని కోరారు.. ఇక, పోలీసుల జోక్యంతో అతడు బయటకు వెళ్లిపోవడంతో వివాదం ముగిసింది.
Read Also: Revanth Reddy: జగ్గారెడ్డి ఇష్యూ టీకప్పులో తుఫాన్..!
మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయ్‌నిధి స్టాలిన్.. ఇలాంటి ఘటనలకు తమిళనాడులో చోటు లేదని స్పష్టం చేశారు.. ఈ ఘటన తమిళనాడులోని మేలూర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెలుగుచూసింది.. బీజేపీ బూత్ ఏజెంట్ ముస్లిం మహిళలు తమ హిజాబ్‌లను తొలగించాలని కోరడంతో ఓటింగ్ ఆలస్యమైంది. మేలూరు మున్సిపాలిటీలోని 8వ వార్డులోని అల్-అమీన్ స్కూల్ పోలింగ్ బూత్‌లో బీజేపీ బూత్ ఏజెంట్‌గా ఉన్న గిరిరాజన్.. ముస్లిం మహిళలు హిజాబ్‌లు తొలగించాలని కోరుతూ హంగామా సృష్టించారు. మహిళలు హిజాబ్‌ను తొలగించాలని కోరారు, లేకపోతే వారిని గుర్తించడం కష్టమని అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే ఏజెంట్లతో సహా ఇతర పార్టీ ఏజెంట్లు, అధికారులు గిరిరాజన్‌ను పోలింగ్ బూత్ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు.. ఇక, పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించిన తర్వాత ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనతో పోలింగ్ బూత్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.