ఉగాది రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏకంగా 11 మంది ప్రాణాలను తీసింది.. తమిళనాడులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపత్తూరు వద్ద ఓ ట్రక్కు 100 అడుగుల లోయలో పడిపోయిన ఘటనలో అక్కడికక్కడే 11 మంది మృతిచెందారు.. మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. మృతులంతా పులియూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయ దర్శనానికి బయల్దేరి వెళ్తుండగా.. ట్రక్కు ప్రమాదానికి గురైంది.. ఈ సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు సీఎం స్టాలిన్.
Read Also: AP: రాజధాని నిర్మాణంపై సీఎస్ అఫిడవిట్.. కీలక అంశాల ప్రస్తావన.