MR. Srinivasan: మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమీషన్ మాజీ చైర్మెన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ ఈరోజు ఉదయం తుది శ్యాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం దక్కింది. పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం పెడుతోంది. పదో తరగతి తెలుగు రీడర్లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్ పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు. Also Read: Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని…
Pakistan: తాను అడుక్కుతిన్నా మంచిదే కానీ, భారత్ ఎదగకూడదు, ఏదో విధంగా ఇండియాను చిరాకు పెట్టాలనేదే దాయాది దేశం పాకిస్తాన్ ఉద్దేశ్యం. భారత్తో నేరుగా తలపడే బలం లేక వెనక నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. పాక్ ప్రజలు ఆకలి కేకలు, నిత్యావసరాల కోసం బాధ పడుతుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదం కోసం,
Madras High Court: నిందితులు పదే పదే కస్టడీలో జారిపడి గాయాలపాలవుతున్నారనే పోలీసులు వాదనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తీరును ప్రశ్నించింది. తన కుమారుడు జాకీర్ హుస్సేన్కు సరైన వైద్య చికిత్స కోరుతూ కాంచీపురానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, వి లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం విచారించింది.
Pirate attack: తమిళనాడు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన పైరెట్స్(సముద్రపు దొంగలు) దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లు శుక్రవారం కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా దాడి జరిగినట్లు చెప్పారు.
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఒక రైతు బలయ్యాడు. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలవంతపు రికవరీ పద్ధతులను అరికట్టడానికి బిల్లును ఆమోదించిన రెండు రోజులకే ఈ మరణం సంభవించింది.
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో... సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.
NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.