Tamil Nadu: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఒక ఆలయంలో అన్నదానం తర్వాత పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల 107 మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు. విరుదునగర్ జిల్లాలోని కల్విమడై గ్రామంలోని కరుప్పన్న స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. జూన్ 6 నుంచి ఆలయంలో కుంభాభిషేకం ఉత్సవంలో భాగంగా సామూహిక అన్నాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Read Also: Jyoti Malhotra: ‘గూఢచారి’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బెయిల్ తిరస్కరణ..
ఆలయంలో వడ్డించిన ఆహారం తిన్న వెంటనే పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది భక్తులు కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లారు. ఆపై తదుపరి చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం నాటికి 41 మంది పురుషులు, 55 మంది మహిళలు, 11 మంది పిల్లలతో సహా 107 మంది రోగులు మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.