Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది.
కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఓట్టన్సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన…
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించేలా బిల్లు రూపొందించింది.. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు.
DMK Govt Erasing Hindu: తమిళనాడు రాష్ట్రంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభుత్వం అధికారిక పత్రాల నుంచి హిందూ అనే పేరును ఉద్దేశపూర్వకంగా తుడిచి వేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఆరోపించారు.
మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్.. తిరుపత్తూరు జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్లను నెలలోపు పిటిషనర్ కు సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అలాగే, రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి ధృవపత్రాలను జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని తమిళనాడు సర్కార్ ను న్యాయస్థానం కోరింది.
Tamil Nadu: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఒక ఆలయంలో అన్నదానం తర్వాత పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల 107 మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు. విరుదునగర్ జిల్లాలోని కల్విమడై గ్రామంలోని కరుప్పన్న స్వామి ఆలయంలో ఈ సంఘటన జరిగింది. జూన్ 6 నుంచి ఆలయంలో కుంభాభిషేకం ఉత్సవంలో భాగంగా సామూహిక అన్నాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి హిట్ అందుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా రాజమౌళి లాంటి వాళ్లే సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది. Also Read:Kannapa Trailer…
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu BJP: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా "సైలెంట్ ఆపరేషన్" నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు.
Amit Shah: తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు.