Tamil Nadu: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రి కె. పొన్ముడి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు ప్రముఖులతో పాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
తమిళనాడు మంత్రి కె.పొన్ముడి హద్దులు దాటి ప్రవర్తించారు. తన స్థాయి మరిచి నీచానికి ఒడిగట్టారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రే.. స్థాయి మరిచి జోక్లు వేశారు. పబ్లిక్ మీటింగ్లో స్త్రీ, పురుషులు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు.
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఇక, ఈ సందర్భంగా రాష్ట్రంలో తర్వలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది.
తమిళనాడుకు చెందిన ఒక జాలరి గొంతులో బతికి ఉన్న చేప అడ్డుపడి ప్రాణాలు కోల్పోయాడు. చెంగల్పట్టులోని మధురాంతకం సమీపంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్) మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ED Raids: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మంత్రి కేఎన్ నెహ్రు, ఆయన కుమారుడు, ఎంపీ అరుణ్ నెహ్రూకు సంబంధించిన ఇళ్లతో పాటు చెన్నైలోని 10 ప్రాంతాలతో పాటు అడయార్, తేనాంపేట, సిఐటి కాలనీ, ఎంఆర్సి నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
MK Stalin: తమిళనాడు రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే, డీలిమిటేషన్ గురించి తమిళ ప్రజల భయాలను తొలగించడానికి ప్రధాని మోడీ నుంచి హామీ కావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్ల వాటా శాతం మారకుండా కసరత్తు చేయాలని కోరారు.
PM Modi: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈరోజు (ఏప్రిల్ 6న) శ్రీ రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న మోడీ..