Forced Debt Collection: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించేలా బిల్లు రూపొందించింది.. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు. అయితే, రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది తమిళనాడులోని స్టాలిన్ సర్కార్.. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లు రూపొదించారు.. బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత ఆత్మహత్యకు పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష పడే విధంగా ఈ కొత్త చట్టం ఉంది.. అసెంబ్లీలో ఈ బిల్లుకు ఇప్పటికే ఆమోదముద్ర పడగా.. తాజాగా, సంబంధిత బిల్లుకు గవర్నర్ రవి ఆమోదముద్ర వేశారు..
Read Also: King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్