కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటించిన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కదంబూర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరవచ్చని బాంబ్ పేల్చారు. విజయ్ ఎన్డీఏ కూటమీలో వస్తారేమో అంటూ తెలిపారు. జనవరి తర్వాత పొత్తులపై స్పష్టత వస్తుందని అన్నారు. డిఎంకేను ఓడించడమే ఏఐఏడీఎంకే, విజయ్ ల లక్ష్యమని అన్నారు. ఇదే ఆలోచనతో విజయ్ సైతం ఉన్నారు. Also Read:Atti…
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొనడంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. డీఎంకే నాయకత్వం ఈడీ లేదా ప్రధాని మోడీకి భయపడదని అన్నారు. తమిళనాడు ప్రజలకు సరైన ఆర్థిక కేటాయింపులు సాధించాలనే ఆసక్తితోనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
DMK: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య విమర్శలకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి, తన భర్త తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుడైన 40 ఏళ్ల వ్యక్తికి అధికార డీఎంకేతో సంబంధాలు ఉన్నాయి. ‘‘అతని పని 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం, అతను నన్ను పిచ్చి…
MR. Srinivasan: మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమీషన్ మాజీ చైర్మెన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ ఈరోజు ఉదయం తుది శ్యాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం దక్కింది. పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం పెడుతోంది. పదో తరగతి తెలుగు రీడర్లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్ పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు. Also Read: Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని…