No Caste, No Community: భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించినప్పటికీ, రిజర్వేషన్ విధానాల ద్వారా సామాజిక జీవితం, రాజకీయాలు, విద్య, ఉపాధిలో కులం, మతం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాకు చెందిన హెచ్ సంతోష్ తన కుటుంబానికి ‘కులం లేదు, మతం లేదు’ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. అలాంటి సర్టిఫికెట్లు జారీ చేయడం కుదరదు అనిని స్థానిక తహశీల్దార్ తేల్చి చెప్పడంతో మద్రాస్ హైకోర్టులో అతడు పిటిషన్ దాఖలు చేశాడు. కులం, మతపరమైన గుర్తింపు లేని సమాజంలో తన పిల్లలను పెంచాలనే కోరికను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ తర్వాత పిటిషనర్ సంతోష్ కి ఊరట కల్పిస్తూ.. తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.
Read Also: Perni Nani: నాకు ఎదురైన బాధ ఎవరికి రాకూడదు.. మాజీ మంత్రి ఆవేదన..!
ఇక, మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎంఎస్ రమేష్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్.. తిరుపత్తూరు జిల్లా కలెక్టర్, సంబంధిత తహశీల్దార్లను నెలలోపు పిటిషనర్ కు సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అలాగే, రెవెన్యూ శాఖను సంప్రదించే అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అటువంటి ధృవపత్రాలను జారీ చేయడానికి వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని తమిళనాడు సర్కార్ ను న్యాయస్థానం కోరింది. అయితే, భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించిన, రిజర్వేషన్ల ద్వారా సామాజిక, రాజకీయాలు, విద్య, ఉపాధిలో కులం, మతం ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఇక, కుల- మతపరమైన గుర్తింపును త్యజించాలన్న పిటిషనర్ నిర్ణయాన్ని న్యాయమూర్తులు ప్రశంసనీయం అన్నారు.