he Reserve Bank of India (RBI) on Friday announced an extension of the deadline for card data storage and tokenisation implementation by another three months to September 30, 2022.
దేశంలో గృహ రుణాల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేయగలిగే గృహ రుణ పరిమితిని రెట్టింపు స్థాయికి ఆర్బీఐ సడలించింది. ఈ పరిమితిని అర్బన్ సహకార బ్యాంకులకు రూ.75 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెంచింది. అలాగే గ్రామీణ సహకార బ్యాంకుల్లోనూ రూ.75 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.30 లక్షలుగానే ఉన్నది. కాగా, అర్బన్ కోఆపరేటివ్…
డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీని వల్ల వినియోగదారులు మరింత సులువుగా పేమెంట్స్ చేసుకునే వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పింది. యూపీఐలతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు…
ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరో సారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు…
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మను మార్చబోమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఫొటోలను ముద్రించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సోమవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్లపై ఇతరుల ఫోటోలు ముద్రించాలన్న కొత్త…
దేశంలో నిత్యావసరాల నుంచి మొదలు అన్నిటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లుగా తయారైంది ప్రజల పరిస్థితి. అయితే.. ఇప్పుడు మరో పెనుభారం సామాన్యుడి నడ్డి విరువనుంది. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో సామాన్యులకు రుణాలు భారంగా మారాయి. మళ్లీ వడ్డీ రేట్లు పెంచితే మధ్య తరగతి జీవులకు గృహ, వ్యక్తిగత తదితర రుణాలు…
దేశంలో దొంగనోట్లు వరదలా వచ్చిపడుతున్నాయి..ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి.. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని… రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. అటు కావలి నుండి ఇటు శ్రీకాకుళం వరకు… ఇటు సత్తుపల్లి నుండి హైదరాబాద్ వరకు…
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని…
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది.. సెన్సెక్స్ భారీగా కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. ఇక, భారత స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా పడింది.. దీంతో, ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఇక, రెపో రేటు…
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలతో ఒకే చెల్లింపుతో ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తికి ఆర్థికంగా చాలా కష్టంగా ఉంటుంది. ఇంటి కొనుగోలు కోసం నిధులను సమీకరించుకోవడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి హోమ్ లోన్(Home Loan). హోమ్లోన్ అనేది బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వంటి ఆర్థిక సంస్థ నుండి ఇంటిని కొనుగోలు చేసే ఏకైక ప్రయోజనం కోసం తీసుకున్న మొత్తం. మీరు హోమ్ లోన్ సహాయంతో ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా?…