Rupee falls: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయి విలువ మరింత దిగజారింది.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది.. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు తగ్గడంతో డాలర్‌కి 78.96 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.. ఇక, ఆ తర్వాత మరింత క్షీణించడంతో ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.09ని తాకింది. మంగళవారం, రూపాయి 48 పైసలు పతనమై యుఎస్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 78.85 వద్ద ముగిసింది.. ఇక, బుధవారం యుఎస్ డాలర్‌తో రూపాయి 11 పైసలు క్షీణించి 78.96కి చేరుకుంది.. మరింత క్షీణించి రూ.79.09కు దిగజారింది. నిరంతర విదేశీ మూలధన ప్రవాహాల కారణంగా రూపాయి మారకం విలువ క్షీణించినట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. బలహీన ఆర్థిక దృక్పథంపై దృష్టి సారించడం ఆసియా కరెన్సీలు మరియు షేర్లపై నష్టాలను ప్రేరేపించడంతో డాలర్‌తో రూపాయి బలహీనంగా ప్రారంభమైందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు.
Read Also: BJP National Executive Meeting: ఎన్టీఆర్ రియల్ హీరో, ఆయన దేవుడు..!
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అస్థిరతను అరికట్టడానికి చర్యలు తీసుకోవచ్చని అయ్యర్ తెలిపారు.. అయితే, ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి 1.87 శాతం నష్టపోయింది మరియు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 6.28 శాతం క్షీణించింది. ఇక, గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.88 శాతం పడిపోయి 116.94 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.08 శాతం తగ్గి 104.42 వద్ద ట్రేడవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ ముందు, 30-షేర్ సెన్సెక్స్ 474.05 పాయింట్లు లేదా 0.89 శాతం క్షీణించి 52,703.40 వద్ద ట్రేడవుతోంది.
- Tags
- dollar
- india
- RBI
- Rupee
- Rupee falls
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!