ఈరోజుల్లో అన్నీ ఆన్ లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తుంటాం. అయితే, జనవరి1, 2022 నుంచి కొన్ని నిబంధనలు మారబోతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. జనవరి 1, 2022 నుండి బ్యాంక్ ఖాతాదారులు తమ కార్డ్ నంబర్, గడువు తేదీ మొదలైన వాటి వివరాలను గూగుల్ సేవ్ చేయదు. అటువంటి పరిస్థితిలో, జనవరి 1 నుండి మాన్యువల్ ఆన్‌లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు, మీరు మాన్యువల్‌గా మీ…
ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండగా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే…
దేశంలో రోజు రోజుకు క్రిప్టో కరెన్సీపై కొన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు సైతం పెట్టారు. దీనిపై భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ స్పందించారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికస్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీపై అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు తప్పవన్నారు. క్రిప్టో…
దసరా, దీపావళి వరుసగా పండుగలతో క్రెడిట్ కార్డులను మాములుగా వాడలేదు ప్రజలు ఈ ఫెస్టెవల్స్ ఖర్చునంతా క్రెడిట్ కార్డుల రూపం లోనే వాడారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డులపై ఖర్చు చేయడం 50శాతం పెరిగింది. నవంబర్ తొలివారంలోనూ ఈ జోరు కనిపించింది. సెప్టెంబర్ నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్, నవంబర్‌లో రికార్డు స్థాయిలకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. రిజర్వు బ్యాంక్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది.. ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించింది ప్రభుత్వం.. శక్తికాంత దాస్ పునర్‌నియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత్ దాస్ పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్ 10 తేదీతో ముగిసిపోనుంది.. కానీ, ఆయనను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నిర్ణయం…
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు…
వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుప్పకూలిన, ఆర్ధిక మోసాలకు గురైన బ్యాంకు డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ చట్టంలో సవరణలను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లకు వారి మొత్తం డిపాజిట్లపై రూ. 5 లక్షల భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా లభిస్తుంది. దివాలా తీసిన బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన తరువాత…
నెల మొత్తం పనిచేసి.. ఎప్పుడు తమ ఖాతాల్లో జీతం డబ్బులు పడతాయా? అని ఎదురుచూస్తుంటారు వేతన జీవులు.. ఇక ఫించన్ దారులు పరిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జమ కావాల్సిన సమయానికి బ్యాంకులకు సెలవు వచ్చాయంటే.. మళ్లీ వర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన పరిస్థితి.. అయితే, ఆ కష్టాలు ఇక ఉండవు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు…