రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 5న నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.
Economy vs Rupee: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రూపాయి విలువ మాత్రం అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారిగా 90 రూపాయల మార్కుకు చేరుకుని బలహీనపడింది.
నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్ల వాడకంపై ఉన్న ఆంక్షలను భారత కేంద్ర బ్యాంకు ఎత్తివేసింది. మరింత సరళమైన వ్యవస్థను ప్రవేశపెట్టింది. నేపాలీ రూపాయి, భారత రూపాయి చలామణిని నియంత్రించే పాత నిబంధనలను భారత రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇప్పుడు రూ.200, రూ. 500ల డినామినేషన్ల భారత రూపాయి నోట్లను నేపాల్‌కు తీసుకెళ్లడానికి, ఉపయోగించడానికి అనుమతిచ్చింది. గతంలో, నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్లపై నిషేధం ఉండేది, దీని వలన ప్రయాణికులు,…
రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ…
జమ్మూ కాశ్మీర్‌లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్‌క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ…
RBI Update On RS. 2000 Notes: 2023 మే 19న రద్దు చేసిన 2000 రూపాయల గులాబీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డెట్ విడుదల చేసింది. ఇంకా ప్రజల నుంచి ఈ నోట్లు పూర్తిగా ఆర్బీఐకి చేరలేదని తెలిపింది. మూడు సంవత్సరాలకు పైగా గడిచినా..5,817 కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన ప్రకారం.. డీమోనిటైజేషన్కు అనంతరం 98.37% నోట్లు…
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంగ్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్లో వడ్డీ…
ఈజీమనీకి అలవాటు పడిన కొందరు దొంగనోట్ల ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చలామణికి పాల్పడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దొంగనోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్ గా దొంగ నోట్ల చెలామణికి పాల్పడుతోంది ముఠా. ఒకే…