India vs West Indies: “భారత్ ఓడితే షో వదిలేస్తా”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. నేడు భారత్ వెస్టిండీస్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ భారతీయుల కంటే పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్, టీవీ షో యాంకర్లకు బాగా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ టీవీ షోల్ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్ సూపర్ 8లో ఎలిమినేట్ అవుతుందని పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ అంచనా వేశాడు. దీన్ని షెహజాద్ తీవ్రంగా విమర్శించాడు. భారత్ ఖచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్ పై ఛాలెంజ్‌లు, సవాళ్లు సైతం విసిరాడు అహ్మద్. “భారత్ గెలిస్తే అమీర్ నుంచి జ్యోతిష్కుడు బిరుదు తీసుకుంటాం, భారత్ ఓడితే ఈ షోనే వదిలేస్తా” అంటూ ‘Haarna Mana Hai’ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో మ్యాచ్‌కు ముందు మైండ్ గేమ్స్ మరింత వేడెక్కాయి. ఈ వీడియే కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
READ MORE: Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
ఇదిలా ఉండగా.. భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌లో ప్రధాన లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం అన్ని జట్లు బలమైన బ్యాటింగ్ లైనప్‌తో దాడికి దిగుతున్నాయి. హై రిస్క్ – హై రివార్డ్ స్టైల్ ఇప్పుడు సాధారణమైపోయింది. వెస్టిండీస్ జట్టు ఇందుకు మంచి ఉదాహరణ. దక్షిణాఫ్రికా (ప్రొటియాస్) చేతిలో భారీ ఓటమి ఎదురైనా, వారి బ్యాటింగ్ ఒక్కసారిగా పుంజుకుంది. బ్యాటర్లు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిశారు. 90 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా, నంబర్ 9లో వచ్చిన రొమారియో షెఫర్డ్ 37 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును 176 పరుగుల దాకా తీసుకెళ్లాడు. నంబర్ 9లో ఇలాంటి ఆటగాడు రావడం చాలా అరుదని భారత అసిస్టెంట్ కోచ్ రయన్ టెన్ డోషాటే సైతం ఒప్పుకున్నాడు. వెస్టిండీస్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు బలమైన బ్యాటింగ్‌తోనే ముందుకు సాగుతున్నాయి. భారత్ తరఫున అక్షర్ పటేల్ లాంటి ఆటగాడు నంబర్ 8లో వస్తే ఊచకోత తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ వికెట్లు పడగొట్టడం భారత్‌కు చాలా ముఖ్యం. చివరికి ఏం జరుగుతోందో చూద్దాం..
READ MORE: Iran Attacks Oil Tanker: ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. నౌకలో భారతీయులు
తాజావార్తలు
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..