Israel-Iran War: ఇరాన్ టాప్-లీడర్‌షిప్ ఖతం.. ఖమేనీ సహా 40 మంది కమాండర్లు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్‌పై తమ దాడుల్ని తీవ్రం చేశాయి. శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. మరోవైపు, ఇరాన్ పశ్చిమాసియా అంతటా ప్రతీకార దాడులకు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్, జోర్డాన్, ఇరాక్ లోని యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మిస్సైళ్లు, డ్రోన్ దాడులతో వణికిస్తోంది.
Read Also: Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ టాప్ నాయకత్వం అంతా మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. రెండో రోజు ఇరాన్‌ను నిర్వీర్యం చేశామని, దాని రాజకీయ సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు చెప్పింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. మొత్తం 40 మంది టాప్ కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన వారిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అతని కుటుంబ సభ్యులతో పాటు రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి, IRGC కమాండర్-ఇన్-చీఫ్ మొహమ్మద్ పక్‌పూర్, సీనియర్ భద్రతా సలహాదారు అలీ షాంఖానీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ సలాహ్ అస్సాది మరియు సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మొహమ్మద్ షిరాజీ ఉన్నారు. ఇరాన్ పోలీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ అధిపతి బ్రిగేడియర్ జనరల్ ఘోలం రెజా రెజాయన్ కూడా మరణించారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!