Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: మేడ్ ఇన్ చైనా వ్యవస్థలు ఎలా ఉంటాయో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. గతంలో భారత్ పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో మన క్షిపణుల్ని పాకిస్తాన్‌లో మోహరించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. ఇటీవల, ఆఫ్ఘాన్‌పై పాక్ దాడి చేసిన తర్వాత, తాలిబన్లు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై డ్రోన్ దాడి చేశారు. ఈ సమయంలో కూడా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని పసిగట్టలేకపోయాయి.
తాజాగా, ఇరాన్‌ను కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నమ్ముకుని ఘోరంగా దెబ్బతింది. ఇజ్రాయిల్, యూఎస్‌లు యథేచ్ఛగా మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నా చైనా తయారీ HQ-9B రక్షణ వ్యవస్థ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇజ్రాయిల్ సృష్టించిన విధ్వంసానికి ఇరాన్ టాప్ లీడర్ షిప్ మరణించారు. ఏకంగా సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు.
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
చైనా HQ-9B మళ్లీ విఫలం, ఇరాన్‌లో విధ్వంసం:
ఇరాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9B గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైనట్లు తెలుస్తోంది. తమ ఆస్తుల్ని రక్షిస్తుందని ఇరాన్ ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసిన ఈ వ్యవస్థ చివరకు ఇజ్రాయిల్, యూఎస్ దాడుల ముందు చేతులెత్తేసింది. వస్తున్న గగనతల ముప్పును తటస్థీకరించలేకపోయింది. 260 కి.మీ దూరంలోని లక్ష్యాలను, 50 కి.మీ ఎత్తులో ఉన్న విమానాలను కూల్చగలదని చైనా చెబుతోంది. కానీ రియల్ టైమ్‌లో చేతులెత్తేస్తోంది. ఇది ఒకేసారి 100 లక్ష్యాలను గుర్తించి, 6-8 క్షిపణుల్ని అడ్డుకోగల సామర్థ్యం ఉందని చెబుతుంటారు.
ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రం, ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్మెంట్ ప్లాంట్, ముఖ్యమైన మిసైల్ బేస్‌ల వద్ద వీటిని మోహరించినప్పటికీ అక్కడ భారీ నష్టం వాటిల్లింది. అమెరికా, ఇజ్రాయిల్ క్షిపణులు వేగం, ఆధునాతన సాంకేతికత ముందు చైనా వ్యవస్థలు నిలవలేదని యుద్ధరంగ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..