సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా 11వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని…
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ……
క్రిఫ్టోకరెన్సీ విషయంలో ఆర్బీఐ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోకరెన్సీల వంటి ప్రైవేటు కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయవని అన్నారు. మదుపర్లు వారి సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెడుతుంటారని, క్రిఫ్టోకరెన్సీల గురించి హెచ్చరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిఫ్టోకరెన్సీలు పెనుముప్పుగా మారతాయని శక్తికాంత్…
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్షా సమావేశానికి సిద్ధం అవుతోంది.. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ కీలక సమావేశం జరగబోతోంది.. అయితే, ఇదే సమయంలో.. వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది.. కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేస్తోంది.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ…
భారత్‌లో డిజిటల్ కరెన్సీ లాంచ్ గురించి ఎప్పటి నుంచే చర్చ సాగుతోంది.. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే కాగా..? అసలు డిజిటల్ కరెన్సీ దేశంలో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. వచ్చే ఏడాదిలో డిజిటల్ కరెన్సీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నమాట.. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే.. ఇది పనిచేస్తుందని చెబుతున్నారు.. ఇక, ఆ కరెన్సీకి ప్రభుత్వ…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీలో ఆఫీసు ఎక్కడ పెడుతుంది? కేంద్రం ఆలోచనేంటి? అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్‌బీఐ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధత ఏర్పడింది. మూడురాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన…
ఎన్నో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.. అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి.. ఇక, ఈ మధ్య చాలా బ్యాంకుల విలీనం కూడా జరిగిపోయింది.. అయితే, బ్యాంకుల పరిస్థితిపై ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక బ్యాంకులుగా పేర్కొంది.. అవి డీ–ఎస్‌ఐబీలు లేదా సంస్థలుగా కొనసాగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది ఆర్బీఐ..…
డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏటీఎం కు వెళ్లి క్యాష్ తెచ్చుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పైగా, ఏటీఎంలలో 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. 5 ట్రాన్సాక్షన్ల తరువాత ప్రతి ట్రాన్సాక్షన్కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ సర్వీస్ చార్జీలు మరింతగా పెరిగాయి. ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వీస్ చార్జీలను పెంచుతూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. గతంతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే సర్వీస్ చార్జీ కింద రూ.…
జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గతంలో కస్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు తీసుకొచ్చింది.. ఈ ఏడాది సెప్టెంబర్లో కార్డు టోకనైజేషన్ సర్వీసులపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది ఆర్బీఐ.. వినియోగదారుల సమ్మతితోనే కార్డు డాటా టోకనైజేషన్ ముందుకు సాగాలని అందులో పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం..…
మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది… 2021కి బైబై చెప్పి.. 2022లోకి అడుగుపెట్టబోతున్నాం.. అయితే, కొత్త సంవత్సరంలో అనేక మార్పులు రాబోతున్నాయి… బ్యాంకింగ్ రంగంలోతో పాటు.. ఇతర రంగాల్లోనూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నూతన సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ కార్డు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా…