పంజాబ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్‌లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు.…
Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, 'మీరు నిప్పుతో ఆడుతున్నారు' అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడ్డారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఓ వీడియోలో వెల్లడించారు. సిక్కులు నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు, మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
Traders Protest on Basmati: దేశంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం వ్యాపారులు నిరసనకు దిగారు. ఇది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరసన కారణంగా దాదాపు 300 హోల్‌సేల్ మార్కెట్లలో బాస్మతి కొనుగోలు నిలిచిపోయింది.
NIA: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన, అతని కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.