Diwali Celebrations: 50 ఏళ్లుగా ఆ గ్రామం దీపావళికి దూరం.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి వేడుకలను ఘనంగా జరపుకోవడానికి యావత్ దేశం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కానీ పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపో ఉండటంతో దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ గ్రామాలు దీపావళి పండగకు దూరంగా ఉండిపోతున్నాయి.
Read Also: UP : నేడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేయనున్న యోగి ఆదిత్య నాథ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పంజాబ్ లోని ఫూస్ మండి, భగు, గులాబ్‌గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం పెట్టారు. దీని వల్ల దాదాపు 5 దశాబ్దాలుగా తాము దీపావళి పండగ జరుపుకోలేదని స్థానికులు చెబుతున్నారు. 1976లో పెద్ద ఎత్తున భూమి సేకరించి కంటోన్మెంట్ నిర్మించారని స్థానిక ప్రజలు తెలిపారు. పండగ రోజు తమ పిల్లలు టపాసులు కాల్చి సంతోషంగా గడపడానికి తమ బంధువులు ఇంటికి పంపించాల్సి వస్తోంది అని వెల్లడించారు. నిబంధనలను విరుద్ధంగా ఎవరైన టపాసులను, పంట వ్యర్థాలను కాల్చినా.. జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్థానిక ప్రజలు చెప్పుకొచ్చారు.
Read Also: Nandamuri Balakrishna: హిందీ భాషపైన నాకున్న సత్తా ఏంటో చూపించా.. బాలయ్య బాబు వీడియో వైరల్!
ఇక, బాణసంచా, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించడంతో పాటు కంటోన్మెంట్లో గడువు ముగిసిన మందుగుండు పేల్చడం వల్ల తమ గ్రామంలో వాటి శకలాలు పడిన ఘటనలు కూడా ఉన్నాయని ఫూస్ మండి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంఘటనల్లో తమ ఆస్తులకు నష్టం కలిగింది అని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీనికి తోడు కంటోన్మెంట్ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం ఉందన్నారు. ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తమ భూముల ధరలు కూడా పెరగలేకపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల పండగ సందర్భాల్లో బంధువులు కూడా తమ ఇళ్లకు వచ్చేందుకు ఇష్టం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల గత 50 సంవత్సరాలుగా దీపావళి పండగ జరుపుకోలేకపోతున్నామన్నారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..