Supreme Court: ‘నిప్పుతో చెలగాటమాడుతున్నారు’.. పంజాబ్, తమిళనాడు గవర్నర్లకు సుప్రీం వార్నింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో జాప్యం చేయడంపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. భారతదేశం ముందు నుంచి వస్తున్న సంప్రదాయాలపై నడుస్తోందని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య ప్రతిష్టంభనపై తాము అసంతృప్తితో ఉన్నామని పేర్కొంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పంజాబ్ తో జరుగుతున్న దానిపై తాము సంతోషంగా లేమని, ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి, గవర్నర్ చేతుల్లో పనిచేయాలని తెలిపింది. బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం గవర్నర్ ఉన్న అంశంపై చట్టాన్ని పరిష్కరించేందుకు షార్ట్ ఆర్డర్ పాస్ చేస్తామని పేర్కొంది.
Read Also: Seediri Appalaraju: పురంధేశ్వరి చంద్రముఖిగా మారారు.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా..?
తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని కూడా సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ వ్యాధి( రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్) పంజాబ్ నుంచి తమిళనాడు వరకు వ్యాపిస్తోందని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బిల్లుల జాప్యంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశం తమ వద్దకు రాకముందే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆప్ ప్రభుత్వం ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 27 బిల్లలుకు 22 బిల్లులకు పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. అయితే అక్టోబర్ 19న మూడు ద్రవ్యవినిమయ బిల్లులను నిలుపుదల చేశారు. తర్వాత నవంబర్ 1న రెండింటికి సమ్మతి ఇచ్చారు. అయితే మూడో ద్రవ్యవినిమయ బిల్లును పరిశీలిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!