ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
Punjab: వరస ఎన్‌కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన…
Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Honor Killing : పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఖానౌరీలో తండ్రి తన సొంత కూతురిని చంపిన ఆశ్చర్యకరమైన భయంకరమైన వార్త బయటకు వచ్చింది. పరువు కోసమే తమ్ముడితో కలిసి తండ్రే సొంత కూతురిని హత్య చేసినట్లు చెబుతున్నారు.
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఆయన కుమర్తె సీరత్ మాన్ చేసిన విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను సీఎం భగవంత్ మాన్ కుమార్తెనని, అయితే ఆయన నాన్న అని పిలిచే హక్కుని చాలా కాలంగా కోల్పోయాడని అన్నారు. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మా గురించి ఏది విన్నారో, అది సీఎం మాన్…
చండీగఢ్లోని అమృత్‌సర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని 'మోస్ట్ వాంటెడ్' నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్‌బీర్ సింగ్ పాకిస్తాన్‌లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Food poisoning: ఇటీవల కాలం పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. సంగ్రూర్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్యాంటీన్లో ఆహారం తిని 60 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు శనివారం తెలిపారు.
Supreme Court: సాధారణంగా పురుషులే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే మహిళపై అత్యాచార కేసు పెట్టవచ్చా..? అనేది ప్రశ్న. అయితే దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ అత్యాచార కేసులో ఒక మహిళ పిటిషన్ వేయడంతో దీన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 61 ఏళ్ల మహిళపై ఆమె కోడలు పెట్టిన కేసులో స్పందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్‌లతో…
PM Modi security breach: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన గతేడాది చర్చనీయాంశంగా మారింది. అత్యంత రక్షణ ఉండే ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పై ఆందోళనకారులు నిలిపేశారు. పంజాబ్ పోలీస్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భద్రతా ఉల్లంఘన జరిగనట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జనవరి 5, 2022 రోజున పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు మోడీ వెళ్లిన క్రమంలో, రైతులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.