Pakistan: పాకిస్తాన్‌లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
INDIA bloc: కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. అదికార బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్న ఇండియా బ్లాక్‌లో లుకలుకలు కనిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో…
గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం ఉన్న ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యి లబో దిబో అన్నాడు.. గర్ల్ ఫ్రెండ్ ను సంతోష పెట్టడానికి ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు .. అత్యుత్సహంతో ఆమెని అడిగాడు .. ఆమె తన పరీక్ష రాయాలని కోరింది .. మొదట షాక్ అయినా తర్వాత ఆమె కోరిక మేరకు అమ్మాయిలాగా మారి పరీక్ష రాయడానికి వెళ్ళాడు.. అమ్మాయిల డ్రెస్ ధరించి బొట్టు, గాజులు, లిప్ స్టిక్‌లతో…
Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
ట్రాఫిక్ నిబంధనలలో (హిట్ అండ్ రన్ లా) కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు నిరసనగా పంజాబ్ లోని కోట్కాపురాలో ఓ ట్రక్కు డ్రైవర్ 250 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కాడు. సుమారు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ సాయంతో పోలీసులు అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘగన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం…
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది.
పంజాబ్ లో న్యూ ఇయర్ వేళ విషాదం నెలకొంది. జలంధర్ జిల్లా అదంపూర్‌లోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు.
Punjab: వరస ఎన్కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి.