పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు.
Swati Maliwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై శీష్ మహల్2.0 ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ముందు ఆయన విలాసవంతమైన భవనం వివాదంగా మారింది. అయితే, ఇప్పుడు ఛండీగఢ్‌లో కూడా ఇలాంటి భవనాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలును ఆపడానికి ఒక ప్రయాణీకుడు గొలుసు లాగాడు. దీంతో ట్రైన్ ఆగడంతో వెంటనే ప్రయాణికులంతా కోచ్ నుంచి సురక్షితంగా బయటకు దిగేశారు. ఈ క్రమంలో పలువురి ప్రయాణికులకు స్వల్పగాయాలు అయినట్లు అధికారి తెలిపారు.
Corruption Case: భారీగా అక్రమాస్తులు, నగదు, బంగారంతో పాటు లంచాలు డిమాండ్ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఓ భారీ లంచకోండి అధికారిని అరెస్ట్ చేసింది. పంజాబ్ లోని రూప్‌నగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లర్ (2009 బ్యాచ్)ను అవినీతి కేసులో సీబీఐ అరెస్టు చేసింది. మొదట రూ.8 లక్షల లంచం డిమాండ్‌తో మొదలైన ఈ కేసు దర్యాప్తులో ఏకంగా రూ.5…
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ముందు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది. Read Also: Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు. పూర్తి వివరాల్లోకి వెళితే……
వాళ్లిద్దరిది కాటికి కాలు చాపిన వయసు. ఎప్పుడు పోతారో తెలియదు. అలాంటి వయసులో ప్రేమలో పడ్డారు ఇద్దరు వృద్ధులు. భారతీయ వృద్ధుడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా అమెరికా నుంచి వచ్చేసింది వృద్ధురాలు. కానీ మరణాన్ని ఊహించక హత్యకు గురైంది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘోరం జరిగింది.
ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు.
ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్‌లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి.
పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.