సరిహద్దు భద్రతా దళం (BSF) మరియు పంజాబ్ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాజతాల్ అనే గ్రామం నుండి డ్రగ్స్ నిండిన కోక్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ద్వారా ఈ ప్రాంతంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిర్దిష్ట ఇన్‌పుట్‌లను స్వీకరించిన తర్వాత శోధన ఆపరేషన్‌ను ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని మాదకద్రవ్యాల స్మగ్లర్లు ఉపయోగించే కొత్త విధానం అని గుర్తించారు.. సైనికులు చైనీస్ నిర్మిత డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం…
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. 2015 మాదకద్రవ్యాల కేసులో పంజాబ్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను ఆప్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆరోపించింది. అయితే అతనిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఆప్ విమర్శలను తోసిపుచ్చింది. మరోవైపు ఇరు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.
Punjab: పంజాబ్లో ఓ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతైంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏకంగా తాళాలు, ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, వాషర్లు ఇలా అనేక వస్తువులను డాక్టర్లు గుర్తించారు. గత రెండేళ్లుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. కడుపునొప్పి, జ్వరం, వాంతులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుూ ఇటీవల మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి వచ్చాడు.
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను…
ఎవరైనా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఏం చేస్తారు వేరే చోట ఉపాధి చూసుకుంటారు. అయితే ఓ యువతి మాత్రం ఎవరు ఊహించని విధంగా యజమానిపై ప్రతీకారం తీర్చుకుంది. ఆమె ప్రవర్తన నచ్చక ఉద్యోగం నుంచి తీసేసిన యజమాని దంపతుల ప్రైవేట్ వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. Also Read: Silk…
Khalistani Terrorists: అర్ష్‌దీప్ సింగ్ డల్లా, లఖ్బీర్ సింగ్ లాండా, గోల్డీ బ్రార్, గురుపత్వంత్ సింగ్ పన్నూ, పరమజీత్ పమ్మా, అవతార్ సింగ్ ఖాండా విదేశాల్లో కూర్చుని ప్రతిరోజూ భారతదేశానికి వ్యతిరేకంగా కొత్త కుట్ర పన్నుతున్న వ్యక్తులు.
Punjab: ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో సోమవారం స్థానికి కాంగ్రెస్ నాయకుడిని తన నివాసంలో కాల్చి చంపారు. బల్జీందర్ సింగ్ బల్లి అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం దాలా గ్రామంలోని బల్లి నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇతను అజిత్వాల్ లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.