Food poisoning: ఫుడ్ పాయిజనింగ్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food poisoning: ఇటీవల కాలం పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. సంగ్రూర్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్యాంటీన్‌లో ఆహారం తిని 60 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు శనివారం తెలిపారు. కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
క్యాంటీన్‌లోని ఆహారం తిన్న తర్వాత శుక్రవారం సాయంత్రం గబ్దాన్‌లోని ప్రభుత్వ మెరిటోరియస్ పాఠశాలలోని 20 మంది చిన్నారులు తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. వీరిని వెంటనే సంగ్రూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 15 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం రోజు మరికొంత మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 50 మంది చిన్నారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారని, దీంతోనే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఆహార నమూనాలను పరీక్ష కోసం తరలించారు. ఈ ఘటనకు ముందు దీపావళి రోజున హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు చెప్పారు.
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!