ఒడిశా సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చాడని ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కానీ అందులో నిజం లేదని కోహ్లీ ట్వీ్ట్ చేశాడు. రైల్వే ప్రమాదం గురించి తెలుసుకున్న కోహ్లీ మరణించినవారి పట్ల దిగ్బ్రాంతి చెందానని, గాయాలపాలైన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అంతేకానీ విరాళం చేశానని ఎక్కడా ప్రకటించలేదన్నాడు కోహ్లీ.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.
రెజ్లర్ల నిరసనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదన్నారు సాక్షి మాలిక్.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.