Lucknow Firing: లక్నోలో కాల్పుల ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం.. చంపిన వాడు బతకడని కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Firing: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ కాల్పుల్లో ఓ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిన సంజీవ్ మహేశ్వరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. విచారణ సమయంలో జడ్జి ఎదుటే కాల్పులు జరిగాయి. దాడికి పాల్పడిన వారు న్యాయవాదుల వేషం ధరించి కోర్టు ఆవరణలో ఈ నేరానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఓ బాలికకు కూడా గాయాలయ్యాయి.
Read Also: Madhyapradesh: బోరుబావిలో 2 ఏళ్ల చిన్నారి.. 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్..
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడని.. కాల్పులు జరిపిన నిందితుడు.. బతకడని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.
Read Also: Varun Tej: వరుణ్ బాబు.. టాలీవుడ్ జాన్ విక్ లా ఉన్నాడురా
రాష్ట్రంలోనే లక్నోలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అఖిలేష్ నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్యమా.. ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు, భద్రత ఎక్కువగా ఉండే చోట ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మరోవైపు లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని దుండగులు కాల్చి చంపారంటూ నిరసన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!