హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు.
తన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో రాజీనామా చేసినట్లు వివరించారు.
అయోధ్యలోని మూడంతస్తుల రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ ఆలయాన్ని వచ్చే జనవరిలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పనులు చివరి దశలో ఉన్నాయని.. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు.
Cyclone Biparjoy: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం…
DGCA కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ క్యారియర్ లకు నిబంధనలు మరింత సులభతరం చేసింది. కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాన్ని ప్రారంభించేందుకు భారతీయ క్యారియర్‌లకు ప్రక్రియను సరళంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెక్‌లిస్ట్‌ను కేవలం 10-పాయింట్‌లకు తగ్గించింది.
కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ జోరు మీదుంది. ఇవాళ మిషన్ మధ్యప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జేపీ అగర్వాల్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖాతో కలిసి గ్వారిఘాట్‌లో నర్మదా నది ఒడ్డున ప్రియాంక పూజలు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా.. బీజేపీని గద్దె దించేందుకు హస్తం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.