Odisha Train Accident: ఒడిశాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 278 మంది ప్రయాణికులు మరణించారు. మరో 1000కి పైగా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారికి స్థానిక హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, పలువురు నేతలు సహా ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే తమ వంతు సాయంగా ఆర్థిక సాయం, ఇతరత్రా సాయాలు ప్రకటించారు.
Read Also: WTC Final: రేపే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్.. ఆసీస్ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న భారత్
ఇదిలా ఉండగా ఒడిశా సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చాడని ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కానీ అందులో నిజం లేదని కోహ్లీ ట్వీ్ట్ చేశాడు. రైల్వే ప్రమాదం గురించి తెలుసుకున్న కోహ్లీ మరణించినవారి పట్ల దిగ్బ్రాంతి చెందానని, గాయాలపాలైన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అంతేకానీ విరాళం చేశానని ఎక్కడా ప్రకటించలేదన్నాడు కోహ్లీ. అయితే సోషల్ మీడియాలో కోహ్లీ విరాళం చేశాడని వస్తున్న వార్త అబద్దమేనన్న మాట. నిజానికి కోహ్లీ రూ.30 కోట్లు విరాళం చేశాడనే పోస్ట్ the.cricket_network అనే క్రికెట్ ఫ్యాన్ అకౌంట్ నుంచి షేర్ అయింది. పైగా విరాట్ కోహ్లీ నుంచి విరాళం గురించి ఎక్కడా అధికారిక ప్రకటన లేదు.
Read Also: Tej Pratap Yadav: మేము వంతెనలు నిర్మిస్తున్నాం.. బీజేపీ వాటిని కూలుస్తోంది..
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై రాజకీయ నేతలతో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రమాదంలో మరణించినవారి పిల్లలకు విద్యనందిస్తానని ప్రకటించాడు. అయితే లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు.