Israel: లెబనాన్ “శ్మశాన వాటిక”లో వెతుకుతున్న ఇజ్రాయిల్.. దీని వెనక ఓ పైలట్ త్యాగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ ఓ వైపు ఇరాన్‌తో మరోవైపు దాని ప్రాక్సీలైన హిజ్బుల్లాపై దాడులు చేస్తోంది. హిజ్బుల్లాను అంతం చేయడానికి లెబనార్‌పై విరుచుకుపడుతోంది. అయితే, తూర్పు లెబనాన్‌లో రాత్రిపూట ‘‘శ్మశాన వాటిక’’ను దున్నేయడం చర్చనీయాంశంగా మారింది. 4 దశాబ్ధాల క్రితం మిస్సైన పైలట్ అవశేషాల కోసం ఇజ్రాయిల్ ప్రత్యేక దళాలు ఒక గ్రామంలోని శ్మశాన వాటికలో విస్తృతంగా సెర్చ్ చేస్తోంది.
1986లో జరిగిన ఘర్షణల సమయంలో యుద్ధవిమానం కూలిపోయిన తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళ నావిగేటర్ రాన్ ఆరాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం ఇజ్రాయిల్ ఇదంతా చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ నిర్వహిస్తు్న్న ఈ ఆపరేషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదని చెప్పింది. ఆరాద్ అవశేషాలు దొరకలేదని ఇజ్రాయిల్ అధికారులు చెప్పారు. అయితే, ఇది కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. బెక్కా వ్యాలీ శ్మశాన వాటికలో సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్‌లో వచ్చిన ఇజ్రాయిల్ కమాండోలు అర్థరాత్రి శ్మశానవాటికలో తనిఖీ చేశారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
1986లో ఘర్షణలో అరాద్ అదృశ్యం:
1986లో ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణల సమయంలో లెబనాన్ మీదుగా ఇజ్రాయిల్ విమానం కూలిపోయింది. ఆ సంఘటన తర్వాత నేవిగేటర్ రాన్ ఆరాద్ మిస్సయ్యారు. బెకా లోయలో ఎక్కడో చోట ప్రమాదం జరిగిన తర్వాత ఆరాద్ మరణించారని, స్థానికంగా ఖననం చేసినట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. 40 ఏళ్లుగా పైలట్ మృతదేహం కోసం ఇజ్రాయిల్ వెతుకుతోంది.
ఆరాద్ గురించి తెలుసుకోవడానికి ఈ దాడి జరిగినట్లు ఇజ్రాయిల్ అధికారులు ధ్రువీకరించారు. అవశేషాలను నబిషిత్ ప్రాంతంలో ఖననం చేయవచ్చని సూచించే నిఘా సమాచారాన్ని పరిశోధించే ప్రయత్నంగా అధికారులు ఈ మిషన్‌ను అభివర్ణించారు. తాజాగా జరిగిన ఆపరేషన్ సమయంలో లెబనీస్ సైన్యం, హిజ్బుల్లా నుంచి ప్రతిఘటన ఎదురైందని, ఆ తర్వాత అక్కడి నుంచి ఇజ్రాయిల్ బలగాలు ఉపసంహరించుకున్నాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.
దశాబ్ధాలుగా ఆరాద్ కోసం అన్వేషణ:
రాన్ ఆరాద్ కోసం దశాబ్ధాలుగా అన్వేషిస్తోంది. మొస్సాద్, ఇతర ఇజ్రాయిలీ ఏజెన్సీలు లెబనాన్‌ను జల్లెడ పడుతున్నాయి. ఓవైపు ఇరాన్ వార్, మరోవైపు హిజ్బుల్లా దాడుల ఇలా ఇజ్రాయిల్ బిజీగా ఉన్నా కూడా తమ పైలట్ అవశేషాల కోసం వెతుకుతూనే ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..