దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉప రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని నిర్మించేందుకు కేటాయించిన స్థలంపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి వినియోగాన్ని మార్చడానికి గల కారణాలను సంబంధిత అధికారులు వివరించారని, ఈ వివరణ సమర్థనీయంగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ…
రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం…