TVK Vijay: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..
- సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్..
- అర్హులైన ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ప్రకటన..
- ఉచితంగా సంవత్సరానికి ఆరు సిలిండర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు అధికార DMK, ప్రతిపక్ష AIADMK శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా.. బలమైన సంక్షేమ అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఉమెన్స్ డే సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న విజయ్.. ఈ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు.
Also Read:Israel: లెబనాన్ “శ్మశాన వాటిక”లో వెతుకుతున్న ఇజ్రాయిల్.. దీని వెనక ఓ పైలట్ త్యాగం..
Also Read
విజయ్ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఇవే..
ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మినహా.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 నేరుగా వారి ఖాతాల్లో జమ.రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు బాలికలకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళల భద్రత కోసం ప్రత్యేక ‘మహిళా పోలీస్ విభాగం’ ఏర్పాటు. పేద కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మహిళలపై జరిగే నేరాలను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టుల’ ఏర్పాటు.
Also Read:Surya Kumar Yadav: బిగ్‌షాక్.. రేపు రిటైర్‌మెంట్ ప్రకటించనున్న సూర్యకుమార్ యాదవ్..!?
ప్రస్తుతం తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నప్పటికీ, విజయ్ ప్రకటించిన రూ. 2,500 నగదు బదిలీ , ఉచిత సిలిండర్ల హామీలు మధ్యతరగతి, పేద వర్గాలను ఆకర్షించే అవకాశం ఉంది. ‘మార్పు కావాలి’ అని కోరుకునే యువతతో పాటు.. ఇప్పుడు మహిళా శక్తిని కూడా తనవైపు తిప్పుకోవడం ద్వారా విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. ద్రవిడ రాజకీయాల కోటలో విజయ్ వేస్తున్న ఈ అడుగులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!