ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కర్జాత్-హస్త్‌పోఖారీలో ఈ రోడ్డును వేశారు. అయితే అలా రోడ్డు వేయడంపై అక్కడి గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా వేసిన రోడ్డును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Balasore train crash: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో 288మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన వందలాది కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు.
తిరిగి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి తిరిగి సేవలను ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుండి చెన్నైకి మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
లక్నోలో కాల్పుల ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడని.. కాల్పులు జరిపిన నిందితుడు.. బతకడని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.