Amit Shah: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. మణిపూర్ లో శాంతి నెలకొనాలని అమిత్ షా గురువారం విజ్ఞప్తి చేశారు, త్వరలో ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించి హింసలో పాల్గొన్న రెండు వర్గాల ప్రజలతో మాట్లాడతానని చెప్పారు.
Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా ఈ రోజు మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. తాజాగా బుధవారం చోటు చేసుకున్న హింసలో బుల్లెట్ గాయాలకు 29 ఏళ్ల యువకుడు మరణించాడు. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్…
Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
Assam: అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. అస్సాం ప్రభుత్వం శనివారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. జీన్స్, లెగ్గింగ్స్ నిషేధిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్ లో వెల్లడించారు. పాఠశాలల్లో టీషర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి ధరించరాదని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు తమ విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదకరమైన డ్రెస్సింగ్ ఉండాలని, అందుకని కొత్త డ్రెస్ కోడ్ పాటించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ…
Rajasthan: బోరుబావి ప్రమాదాలు మనం చాలా సార్లు చూశాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు. అధికారులు ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరకు వారి మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ రాజస్థాన్ లో ఓ 9 ఏళ్ల పిల్లాడు బోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థార్ లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.