wrestlers protest: గత నెలరోజులుగా రెజ్లర్లు తమ ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి పోరాటానికి పలువురు నేతలు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు వారి పతకాలను హరిద్వార్ లోని గంగానదిలో కలిపేందుకు రాగా.. వారిని అడ్డుకుని ఐదు రోజుల గడవు కూడా విధించారు. ఆ గడువు ముగియగానే శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షా సమాధానంపైనా రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Gufi Paintal: ‘మహాభారత్’ నటుడు ఇకలేరు
మరోవైపు రెజ్లర్ల ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సాక్షి మాలిక్ ఆందోళన విరమించుకున్నట్లు టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తిరిగి ఆమె ఉత్తర రైల్వేలో తన పదవిలో చేరినట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు రెజ్లర్ల నిరసనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదన్నారు సాక్షి మాలిక్.
Read Also: Naga Vamsi: ఈ యంగ్ ప్రొడ్యూసర్ ‘సింహం’తో సినిమా చేస్తున్నాడా?
తమ ఉద్యోగాలలో చేరడానికి వీలుగా ఫోగట్, పూనియా, సాక్షి రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం వార్త కథనాలు వచ్చిన నేపథ్యంలో సాక్షి మాలిక్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. చూడాలీ మరి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన రెజ్లర్ల ఆందోళనకు ఎండ్ కార్డ్ ఎప్పుడపడుతుందో.